close

Sunday, August 06, 2017

జనరల్

ఏపీలో పారిశ్రామికీకరణకు ప్రోత్సాహం
మంగళం(తిరుపతి), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక పారిశ్రామిక విధానాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహికులను ప్రోత్సహిస్తోందని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ఎక్స్‌ఎల్‌ఆర్‌8 డైరెక్టర్‌ గ్లెన్‌ రాబిన్‌సన్‌ పేర్కొన్నారు. తిరుపతి సమీపం వెంకటాపురంలోని ఏపీఐఎస్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌8లో శనివారం 13 జిల్లాల ఫ్యాకల్టీ మెంటర్స్‌కు(అధ్యాపకుల సలహాదారులు) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలోని ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వ్యవస్థాపకులను తయారు చేసే ఉద్దేశంతో ఏపీ ఎక్స్‌ఎల్‌ఆర్‌8ను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఏపీలోని అన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులకు ఇన్నోవేషన్‌ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అనే అంశాలపై ఫ్యాకల్టీ మెంటర్స్‌ సహాయంతో, ఆస్టిన్‌ దేశంలోని ఐసీ స్క్వైర్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు, సంస్థలకు బూట్‌ క్యాంప్‌లను నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే తొలిదశలో 13 జిల్లాల్లో నియమితులైన ఫ్యాకల్టీ మెంటర్స్‌కు పూర్తిస్థాయి దిశనిర్దేశం కోసం శిక్షణ ఇచ్చామన్నారు. వీరు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 150 మంది స్టూడెంట్‌ ఇన్నోవేటర్స్‌ను ఎంపికచేసి, వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఐసీ స్క్వైర్‌ నిర్దేశించిన ఆన్‌లైన్‌ ఇన్నోవేషన్‌ కోర్సు సిరీస్‌లో విద్యార్థులను సంసిద్దులను చేస్తామని తెలిపారు. వీరిలో ప్రతిభ కలిగిన 30 మంది విద్యార్థులను ఎంపికచేసి, వారికి సెప్టెంబర్‌ నెలలో తిరుపతిలోని ఏపీ ఎక్స్‌ఎల్‌ఆర్‌8లో మూడురోజుల శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో తిరుపతి ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ఛైర్మన్‌ గీతాశ్రీ, 13 జిల్లాల నుంచి వచ్చిన అధ్యాపకుల సలహాదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.