close

Tuesday, October 16, 2018

జనరల్

సేంద్రియ పంటలతోనే ప్రజారోగ్యానికి రక్షణ
డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: సేంద్రియ పంటలు మాత్రమే మానవాళి ఆరోగ్యాన్ని కాపాడగలవని మెటావేర్‌ సంస్థ (న్యూయార్క్‌) వ్యవస్థాపకులు మర్ఫీజెరాఫ్‌ అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్‌ వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను 30 ఏళ్లుగా వ్యవసాయంపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. అమెరికాలోని 83 శాతం ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారన్నారు. భారతదేశంలో మాత్రం రసాయనిక క్రిమి సంహారకాలు చల్లి వ్యవసాయం చేయడం వల్ల వాటిని తినే ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారన్నారు. ఆ మందులకు వ్యాధినిరోధకత ఏర్పరుచుకున్న కీటకాలు, క్రిములు మరింత బలపడి పంటలపై దాడి చేస్తుండడంతో దిగుబడి తగ్గిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. భారతదేశంలో పంటల సరళిని అధ్యయనం చేసేందుకు అక్టోబరు 4న ఇక్కడికి వచ్చామని, తిరుపూరు, కోయంబత్తూరు, దిల్లీ తదితర ప్రాంతాల్లోని రైతులను కలిశామన్నారు. మూడు రోజులుగా ఉత్తరాంధ్ర రైతులతో మాట్లాడి సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామీణ వికాస్‌ కేంద్రం ప్రతినిధి అలిన్‌కుమార్‌, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ కో వైస్‌ ఛైర్మన్‌ విజయకుమార్‌ గ్రామీణ వికాస్‌ కేంద్రం ప్రతినిధి శరత్‌బాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.